: టీడీపీ ఎంపీటీసీని కిడ్నాప్ చేసిన వైకాపా నేత లొంగుబాటు... పరిస్థితి ఉద్రిక్తం
ప్రకాశం జిల్లా కనిగిరిలో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. టీడీపీ ఎంపీటీసీని కిడ్నాప్ చేసిన వైకాపా నేత గురవయ్య పోలీసులకు లొంగిపోయారు. గురవయ్యను తమకు అప్పగించాలంటూ టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో టీడీపీ-వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై మరొకరు దాడులకు తెగించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.