: భవనం కూలిన ఘటనలో నానాటికీ పెరుగుతున్న మృతుల సంఖ్య
చెన్నైలో బహుళ అంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. నేటికి ఈ ఘటనలో ప్రాణాలు విడిచినవారి సంఖ్య 61కి చేరింది. కాగా, సంఘటన స్థలంలో శిథిలాల తొలగింపు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం చెన్నై శివారు ప్రాంతంలో 11 అంతస్తుల భవనం నిర్మాణ దశలోనే కుప్పకూలడం తెలిసిందే.