: బాబును కలిసిన సింగపూర్ మంత్రి షణ్ముగం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును సింగపూర్ విదేశాంగ శాఖ మంత్రి షణ్ముగం కలిశారు. హైదరాబాదులోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా సింగపూర్ తరహా గృహ నిర్మాణానికి సహాయం చేయాల్సిందిగా బాబు ఆయనను కోరారు. రాజమండ్రి రీజియన్ లో గ్యాస్ వెలికితీతకు సహాకారం చేయాల్సిందిగా బాబు ఆయనకు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.