: ‘బ్రిక్స్’ సమావేశానికి హాజరవుతున్న మోడీ
బ్రెజిల్ లోని ఫోర్టాలెజాలో ఈ నెల 15వ తేదీన ప్రారంభమవుతున్న ‘బ్రిక్స్’ సమావేశానికి ప్రధాని మోడీ హాజరుకానున్నారు. ఈ సమావేశాలకు వెళ్లేటప్పుడు మార్గమధ్యంలో జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ లో జర్మనీ ఛాన్సెలర్ ఏంజెలా మెర్కెల్ తో మోడీ భేటీ అయ్యే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బ్రిక్స్ కూటమిలో బ్రెజిల్, రష్యా, భారత్, దక్షిణాఫ్రికా, చైనా సభ్య దేశాలుగా ఉన్నాయి.