: 3డి మొబైల్ గేమ్ ఆవిష్కరించిన భారత వాయుసేన
భారత వాయుసేన దేశంలోనే తొలిసారిగా 3డి మొబైల్ గేమ్ ను ఆవిష్కరించింది. ఈ గేమ్ ద్వారా యువతను వాయుసేన దిశగా ఆకర్షించడమే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ముఖ్య ఉద్దేశం. ఈ గేమ్ పేరు 'గార్డియన్స్ ఆఫ్ ద స్కైస్'. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ గేమ్ ను ఆవిష్కరించారు. యువతను లక్ష్యంగా చేసుకుని ఈ గేమ్ రూపొందించామని ఎయిర్ మార్షల్ ఎస్.సుకుమార్ తెలిపారు. ఆ 3డి గేమ్ ఆండ్రాయిడ్, విండోస్, ఐఓఎస్ ప్లాట్ ఫామ్ పై ఉచితంగా లభిస్తుంది. ఈ గేమ్ లో పొందుపరిచిన స్టోరీ లైన్, శత్రువు అంతా కల్పితేమనని, అయితే, గేమింగ్ అనుభవం మాత్రం రియల్ అని సుకుమార్ పేర్కొన్నారు.