: తిరిగి జైలుకు వెళ్ళడం కోసం..!
ఓ వ్యక్తి జైలుకు వెళ్ళడం కోసం ఏంచేశాడో చూడండి! సింపుల్ గా ఓ సిగరెట్ ప్యాకెట్ తీసుకుని డబ్బులివ్వకుండా వచ్చేశాడు. అమెరికాలోని వెస్ట్ ఫీల్డ్ లో జరిగిందీ ఘటన. ఓ దుకాణంలోకి వెళ్ళిన సదరు జైలు పిచ్చోడు జాన్ స్కోరాన్ కిర్వాన్ సిగరెట్ ప్యాకెట్ అడిగాడు. గుమస్తా ఇచ్చిన సిగరెట్ ప్యాకెట్ తీసుకుని తాపీగా బయటికి నడిచాడు. వెనుకనుంచి గుమస్తా డబ్బులివ్వకపోతే పోలీసులకు ఫోన్ చేస్తానని చెప్పడంతో, సదరు వ్యక్తి 'గో ఎహెడ్' అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఆ షాపు గుమస్తా పోలీసులను పిలవడం, వారు వచ్చి అక్కడికి సమీపంలోని బస్ స్టాప్ లో ఉన్న కిర్వాన్ అదుపులోకి తీసుకోవడం చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం తాను ప్రొబేషన్ పై బయట ఉన్నానని, మరలా జైలుకు వెళ్ళాలనిపించడంతోనే సిగరెట్ ప్యాకెట్ కు డబ్బులివ్వకుండా వచ్చేశానని తొణుకూబెణుకూ లేకుండా చెప్పాడు.