: ప్రతి ఏడాది లక్ష కోట్లతో రోడ్లను అభివృద్ధి పరుస్తాం: గడ్కరీ


దేశంలో రోడ్డు రవాణా వ్యవస్థను ఉన్నత స్థితికి తీసుకెళతామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దీనికోసం ఏడాదికి లక్ష కోట్ల రూపాయలను కేటాయించడానికి ఎన్డీయే ప్రభుత్వం కంకణం కట్టుకుందని చెప్పారు. నెల రోజుల్లో రవాణా రంగ సంస్కరణలకు సంబంధించి బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తామని చెప్పారు. రెండేళ్లలోనే ఫలితాలు కనిపిస్తాయని... మార్పును ప్రతి ఒక్కరూ చూడవచ్చని తెలిపారు. జాతీయ రహదారుల విషయంలో భూసేకరణ విధానం సక్రమంగా లేకపోవడంతో ఈ రంగం దారుణంగా దెబ్బతిందని చెప్పారు.

  • Loading...

More Telugu News