: బెంగళూరులోని జ్యూయలరీ షాపులో అగ్నిప్రమాదం


బెంగళూరు ఎంజీ రోడ్డులోని ఓ జ్యూయలరీ షాపులో అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో నవరత్న జ్యూయలర్స్ లో ఈ ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ఏడు ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. సిబ్బందిని రక్షించిన అనంతరం, విలువైన బంగారు ఆభరణాలను ప్లాస్టిక్ సంచుల్లో నింపి దుకాణంలోని మొదటి అంతస్తు నుంచి కిందకు విసిరారు. ఈ ఘటనతో ఎంజీరోడ్డులో రెండు గంటల పాటు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది.

  • Loading...

More Telugu News