: వింబుల్డన్ ప్రీక్వార్టర్స్ లో సానియా
భారత టెన్నిస్ ఏస్ సానియా మీర్జా వింబుల్డన్ మిక్స్ డ్ డబుల్స్ విభాగంలో ప్రీక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్ళింది. రొమేనియా క్రీడాకారుడు హోరియా టెకావుతో జతగా బరిలో దిగిన సానియా నేటి మ్యాచ్ లో అలవోక విజయం నమోదు చేసుకుంది. వరుణుడు అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్ లో సానియా జోడీ 6-3, 6-3తో మాట్ పావిక్, బొజానా జొవనోవ్ స్కీ జంటపై 58 నిమిషాల్లో నెగ్గింది.
మరో మ్యాచ్ లో చెక్ క్రీడాకారిణి ఆండ్రియా లవకోవాతో జతకట్టిన భారత క్రీడాకారుడు రోహన్ బోపన్నకు పరాజయం ఎదురైంది. ఈ ఇండో-చెక్ ద్వయం 6-3, 5-7, 3-6తో మిఖాయిల్ ఎల్జిన్ (రష్యా), అనస్తాసియా రోడియోనోవా (ఆస్ట్రేలియా) జంట చేతిలో ఓటమిపాలైంది. రోహన్ కు పురుషుల విభాగం డబుల్స్ లోనూ చుక్కెదురైన సంగతి తెలిసిందే.