: 27 ఏళ్ల తర్వాత... హిందూపురం మున్సిపాలిటీలో టీడీపీ పాగా


27 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత హిందూపురం మున్సిపాలిటీలో టీడీపీ గెలుపొందడం శుభ పరిణామమని సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. కౌన్సిల్ సభ్యులందరితో సమన్వయం చేసుకుని హిందూపురం మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు. మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ కోసం హిందూపురం పురపాలక సంఘ కార్యాలయంలో జరిగిన సమావేశంలో బాలకృష్ణ పాల్గొన్నారు. ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఎమ్మెల్యే హోదాలో బాలకృష్ణ, ఎంపీ నిమ్మల కిష్టప్ప ఓటు వేశారు. మున్సిపల్ ఛైర్మన్ గా ఆర్. లక్ష్మి, వైస్ ఛైర్మన్ గా జి.పి.కె.రాములు ఎన్నికయ్యారు.

  • Loading...

More Telugu News