: ప్రపంచంలో అత్యంత శృంగార మహిళగా దీపికా పదుకొనె


బాలీవుడ్ పొడుగుకాళ్ల సుందరి దీపికా పదుకొనె ప్రపంచంలో అత్యంత శృంగార మహిళగా గుర్తింపు పొందింది. ఎఫ్ హెచ్ఎం మ్యాగజైన్ నిర్వహించిన పోల్ లో ఎక్కువమంది దీపికకే ఓటు వేశారు. మొత్తం వందమంది మహిళలు ఈ జాబితాలో నిలవగా, వారందరినీ పక్కకునెట్టి అమ్మడు ముందు వరసలో నిలిచింది. ఈ మేరకు మ్యాగజైన్ తాజాగా రూపొందించిన కొత్త ఎడిషన్ కవర్ పేజ్ పై సొట్టబుగ్గల సుందరి దర్శనమిచ్చింది. దానిని దీపికనే నిన్న (బుధవారం) రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె, ఈ పోల్ కు తన భౌతిక ఆకారానికి ఎలాంటి పోలిక లేదని, తన హార్డ్ వర్కే తనకీ గుర్తింపునిచ్చిందని నమ్ముతున్నానని తెలిపింది.

  • Loading...

More Telugu News