: ఆటా సభలకు జేఏసీ ఛైర్మన్ కోదండరాం
అమెరికాలోని ఫిలడెల్ఫియాలో నేటి నుంచి ప్రారంభంకానున్న ఆటా సభలకు తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం హాజరవుతున్నారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు పలు విషయాలపై ఆయన ప్రసంగిస్తారు. ఇప్పటికే టీఆర్ఎస్ నేత వి.ప్రకాష్ అక్కడికి చేరుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ పనితీరు, పథకాల అమలు గురించి ఈయన అక్కడి వారికి వివరిస్తారు. ఇక జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి, రచయిత సి.నారాయణ రెడ్డి, గాయకుడు బాలసుబ్రమణ్యం, సినీ నటులు శ్రేయ, సునీల్, రానా తదితరులు పాల్గొంటున్నారు. ఈ నెల 5 వరకు ఈ సమావేశాలు అట్టహాసంగా జరగనున్నాయి.