: ఒక్క ఆరోపణ నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా: మధ్యప్రదేశ్ సీఎం
మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు స్కామ్ లో తనపై స్థానిక కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడిన ఆయన, హస్తం నేతల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. తాను అవకతవకలకు పాల్పడే అపరాధిని కానన్నారు. తనపై వచ్చిన అవకతవకల ఆరోపణపై దర్యాప్తు చేయించుకుని, నిరపరాధిగా నిరూపించుకున్నానని చెప్పారు. ఈ క్రమంలో తనపై వచ్చిన ఒక్క ఆరోపణను రుజువు చేసినా జీవితాంతం రాజకీయ సన్యాసం తీసుకుంటానని సభలో సవాల్ విసిరారు. అనంతరం మీడియాతో మట్లాడిన చౌహాన్, ఈ స్కాం ద్వారా తన భార్య సాధన లబ్ది పొందారంటూ చేసిన ఆరోపణలకు ఆధారం లేదని కొట్టిపారేశారు.