: అమిత్ షాకు జడ్ ప్లస్ భద్రతపై ప్రశ్నించిన కాంగ్రెస్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సన్నిహితుడు, బీజేపీ జనరల్ సెక్రెటరీ అమిత్ షాకు కేంద్ర ప్రభుత్వం జడ్ ప్లస్ భద్రత కేటాయించడంపై కాంగ్రెస్ నిలదీసింది. ఆయనకు ఎందుకు ఆ భద్రత కల్పిస్తున్నారంటూ ప్రశ్నించింది. ఈ మేరకు కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ మీడియాతో మాట్లాడుతూ, షాకు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఎందుకు ఇచ్చారో దేశానికి కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా చెప్పాలని డిమాండ్ చేశారు.