: నగర శివార్లలో రజనీకాంత్ సినిమా షూటింగ్ ను అడ్డుకున్న స్థానికులు
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త చిత్రం 'లింగా'ను స్థానికులు అడ్డుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం అనాజ్ పూర్ గ్రామ సమీపంలో జరుగుతోంది. షూటింగ్ సందర్భంగా చెరువులోకి రసాయన పదార్థాలు కలుస్తున్నాయని, నీరు కలుషితమవుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అయితే, షూటింగ్ కోసం ఇరిగేషన్, గ్రామ పంచాయతీల నుంచి అనుమతి పత్రం తీసుకున్నామని సినిమా సిబ్బంది చెబుతున్నారు.