: సుప్రీంలో జగన్ బెయిల్ పిటిషన్


వైఎస్ జగన్మోహన రెడ్డి ఈ ఉదయం సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణను న్యాయస్థానం రేపు చేపట్టనుంది. అక్రమాస్తుల కేసులో అరెస్టయిన జగన్ కొన్నాళ్ల నుంచి హైదరాబాద్ చంచల్ గూడ జైలులో రిమాండులో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు, నాలుగురోజుల కిందట ఈ కేసులో సీబీఐ ఐదవ ఛార్జిషీటు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. లోగడ బెయిల్ కోసం జగన్ సుప్రీం కోర్టుకు వెళ్లినప్పుడు ఈ కేసులో చార్జ్ షీటు దాఖలు ప్రక్రియ ముగిసేంత వరకూ బెయిల్ మంజూరు చేసేది లేదని స్పష్టం చేస్తూ పిటిషన్ కొట్టివేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News