: డాలర్ శేషాద్రి పదవీ కాలం మళ్లీ పెంచారు
తిరుమలలో తిష్టవేసేందుకు డాలర్ శేషాద్రి మరోమారు చక్రం తిప్పారు. దాంతో, తాజాగా తన పదవీకాలాన్ని పొడిగించేలా టీటీడీని ఒప్పించారు. ఈ క్రమంలో మరో రెండు సంవత్సరాల పాటు ఆయన తిరుమలలో కొనసాగనున్నారు. గత ఎనిమిది సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలోనే ఆలయ ఆఫీసర్ ఆన్ డ్యూటీ (ఓఎస్ డీ)గా ఆయన కొనసాగుతున్నారు. పదవీ విరమణ చేసినా ఆలయ ఓఎస్ డీ గా శేషాద్రిని కొనసాగించడంపై మరోవైపు విమర్శలు వినిపిస్తున్నాయి.