: మెదక్ జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు పల్టీకొట్టింది
ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల ప్రమాదాలు ఈవేళ సాధారణమైపోయాయి. తాజాగా తెలంగాణలోని మెదక్ జిల్లా మునిపల్లి మండలం బుదేర గ్రామ శివారులో 65వ జాతీయ రహదారిపై నీతా ట్రావెల్స్ బస్సు పల్టీకొట్టింది. దాంతో రహదారి పక్కనే ఉన్న గుంతలో బస్సు పడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సులోని పదిమందికి గాయాలయ్యాయి. వెంటనే సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రికి వారిని తరలించారు. ఉదయం 9 గంటల సమయంలో బస్సు ముంబయి నుంచి హైదరాబాదు వస్తుండగా ప్రమాదం జరిగింది.