: ఏపీలో టీడీపీ, వైకాపాలు కైవసం చేసుకోనున్న స్థానాలు
ఆంధ్రప్రదేశ్ లో 7 కార్పొరేషన్లు, 92 మున్సిపాలిటీలకు ఈ రోజు పరోక్ష ఎన్నికలను నిర్వహించనున్నారు. కార్పొరేషన్ల విషయానికి వస్తే... టీడీపీ చేతిలో రాజమండ్రి, చిత్తూరు, అనంతపురం, ఏలూరు, విజయవాడ కార్పొరేషన్లు ఉన్నాయి. నెల్లూరు, కడప కార్పొరేషన్లలో వైకాపాకు ఆధిక్యత ఉంది. మున్సిపాలిటీల విషయానికొస్తే... 58 చోట్ల టీడీపీ, 15 చోట్ల వైకాపాకు మెజారిటీ ఉంది. మిగిలిన 19 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. తాజా రాజకీయాల నేపథ్యంలో హంగ్ స్థానాలలో అధికారపక్షం పాగా వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక జిల్లా పరిషత్ ల విషయానికొస్తే... 13 జిల్లాలలో 9 జిల్లా పరిషత్ లను టీడీపీ కైవసం చేసుకోనుంది. మిగిలిన 4 జెడ్పీలను వైకాపా చేజిక్కించుకునే అవకాశం ఉంది.