: ముక్కు పిండి మరీ ఫీజులు వసూలు చేసినందుకే ఆయనకు మంత్రి పదవా?: తమ్మినేని
విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు ముక్కు పిండి మరీ వసూలు చేసినందుకు బహుమానంగానే నారాయణ సంస్థల అధినేతకు చంద్రబాబునాయుడు మంత్రి పదవి ఇచ్చారని వైఎస్సార్సీపీ నేత తమ్మినేని సీతారాం ఆరోపించారు. శ్రీకాకుళంలో ఆయన మాట్లాడుతూ, నారాయణ విద్యా సంస్థల్లోని విద్యార్థుల నుంచి పి.నారాయణ జలగలా పీల్చి పిప్పి చేసి ఫీజులు వసూలు చేశారని అన్నారు. కార్పోరేట్ రాజకీయ వేత్తలకు బాబు పెద్దపీట వేశారని తమ్మినేని విమర్శించారు. మండలపరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో విప్ కు వ్యతిరేకంగా ఎవరైనా ఓటేస్తే అనర్హత వేటుకు గురవుతారని తమ్మినేని హెచ్చరించారు.