: ‘బంధన్’లో రిక్రూట్ మెంట్ మొదలైంది


రిజర్వ్ బ్యాంక్ నుంచి లైసెన్స్ అందుకున్న మైక్రో ఫైనాన్స్ కంపెనీ ‘బంధన్’ ఫైనాన్షియల్ సర్వీస్ లో రిక్రూట్ మెంట్ మొదలైంది. కోల్ కతా కేంద్రంగా పనిచేస్తున్న బంధన్ లో ముఖ్యంగా ఐటీ, ఫైనాన్స్ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంస్థ శ్రీకారం చుట్టింది. ఆయా రంగాల్లో నిపుణులైన వారి కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇందుకోసం దినపత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చామని బ్యాంకు వర్గాలు మీడియాకు తెలిపాయి. బంధన్ ఈ ఆర్థిక సంవత్సరంలోనే బ్యాంకుగా తన కార్యకలాపాలు ప్రారంభిస్తుందని ఆ సంస్థ ఛైర్మన్ శేఖర్ ఘోష్ చెప్పారు.

  • Loading...

More Telugu News