: దావూద్ ఇబ్రహీం నిజజీవితం ఆధారంగా సినిమా
అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం జీవితంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఓ సినిమా నిర్మితమవుతోంది. 'దావూద్' పేరిట ఈ సినిమాను రాజేష్ పుత్ర తెరెకెక్కించనున్నారు. ఈ సినిమా దావూద్ జీవితంలోని కొత్త కోణాలను బయటపెడుతుందని డైరెక్టర్ రాజేష్ పుత్ర వెల్లడించారు. దావూద్ ఇబ్రహీం మాఫియాను ఎందుకు ఎంచుకున్నాడు? దావూద్ ఆ మార్గంలో పయనించేందుకు కారణాలేంటి? ఇత్యాది విషయాలు తమ సినిమాలో చూపిస్తున్నట్టు ఆయన తెలిపారు.
తొమ్మిది భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రారంభమైంది. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కించనున్నారు. 'డిక్కి ఇంటర్నేషనల్ ప్రొడక్షన్' బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుందని రాజేష్ పుత్ర ఆశాభావం వ్యక్తం చేశారు.