: తెలంగాణ ప్రభుత్వంపై న్యాయపోరాటం చేస్తాం: రావెల
తెలంగాణ ప్రభుత్వం తీరుపై ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్ మెంట్ పై తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పై నియమనిబంధనలు ఉల్లంఘిస్తే తెలంగాణ ప్రభుత్వంపై న్యాయపోరాటం చేస్తామని రావెల తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను సమర్థవంతంగా అమలు చేస్తామని ఆయన వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే సబ్సిడీని పెంచే ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తోందని ఆయన వివరించారు.