: ప్రజాస్వామ్యంలో ఛానళ్ల నిషేధం అక్రమం: వెంకయ్యనాయుడు
టీవీ9, ఏబీఎన్ ఛానళ్ల ప్రసారాలను తెలంగాణలో నిలిపివేయడాన్ని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఛానళ్ల నిలిపివేత అక్రమం, అన్యాయం అని అన్నారు. దీనిపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ను కలసి మాట్లాడానని, ఛానళ్ల నిలిపివేతపై తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు. ఎంఎస్ వోలు ఛానళ్లను వెంటనే పునరుద్ధరించాలన్నారు.