: 'కౌన్సిలింగ్ ఇవ్వకపోతే స్వారెజ్ మళ్ళీ కొరకడం ఖాయం'


ఉరుగ్వే ఆటగాడు లూయిస్ స్వారెజ్ కు కౌన్సిలింగ్ అత్యవసరమని ప్రవర్తన నిపుణురాలు సైమా లతీఫ్ అంటున్నారు. లేకపోతే మరోసారి కొరకడం ఖాయమని ఆమె స్పష్టం చేశారు. ఈ విషయంలో తాను పందెం కాసేందుకు కూడా సిద్ధమని ధీమాగా చెప్పారు. సాకర్ వరల్డ్ కప్ లో స్వారెజ్ ఇటలీ డిఫెండర్ భుజంపై కొరికి ఫిఫా నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. అతనిలోని నరమాంసభక్షక ప్రవృత్తి తొలగిపోవాలంటే నిపుణులతో చికిత్స అవసరమని సైమా సూచించారు. పొరబాటున పళ్ళు ఇటలీ డిఫెండర్ కు గుచ్చుకున్నాయని స్వారెజ్ చెప్పడాన్ని బట్టి, అతను తప్పును అంగీకరిస్తున్నట్టు కనిపించడంలేదని ఆమె విశ్లేషించారు.

  • Loading...

More Telugu News