: గోదావరి మహాకుంభమేళాపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు
2015లో జరిగే గోదావరి మహాకుంభమేళాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. మొత్తం ఐదుగురు మంత్రులతో ఈ ఉపసంఘం ఏర్పాయింది. ఆర్థిక, దేవాదాయ, మున్సిపల్, హోం, వైద్యశాఖల మంత్రులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. అంతేగాక నైపుణ్యాల అభివృద్ధిపై ముగ్గురు మంత్రులతో ఉపసంఘం ఏర్పాటైంది. మానవ వనరులు, మున్సిపల్, కార్మిక శాఖ మంత్రులు ఇందులో సభ్యులుగా ఉన్నారు.