: సచిన్ టెండూల్కర్ ఎవరో నాకు తెలియదు!: మరియా షరపోవా


టెన్నిస్ ఆటకు రాణి, పలు గ్రాండ్ స్లామ్ లు గెల్చుకున్న విజేత మరియా షరపోవా తెలిసి అన్నదో లేక తెలియక అనేసిందో తెలియదు కానీ, మొత్తానికి ప్రపంచ క్రికెట్ అభిమానులు బిత్తరపోయే విధంగా తనకు సచిన్ టెండుల్కర్ అంటే ఎవరో తెలియదు అని ఓ సందర్భంలో అన్నట్టు టెన్నిస్ వరల్డ్ యూఎస్ఏ.ఓఆర్ జీ (tennisworldusa.org) తెలిపింది. ప్రతి ఏడాది జరిగే వింబుల్డన్ పోటీలకు సచిన్ హాజరవుతుంటాడు. ఈ ఏడాది కూడా లండన్ లో జరుగుతున్న పోటీలకు వెళ్లాడు. ఐదు రోజుల కిందట (శనివారం) జరుగుతున్న మ్యాచ్ ను వీక్షించేందుకు రాయల్ బాక్స్ సీటులో ఇంగ్లిష్ ఫుట్ బాలర్ డేవిడ్ బెక్ హామ్, గోల్ఫర్ ఇయాన్ పౌల్టర్ ల సరసన సచిన్ కూడా కూర్చున్నాడు. వారిలో పాప్యులర్ బెక్ హామ్ అంటే షరపోవాకు బాగా తెలుసు. కానీ, సచిన్ తెలియదు. అప్పుడే సచిన్ తెలుసా మీకు? అని ఓ విలేకరి ఆమెను అడిగాడు. వెంటనే 'నాకు తెలియదు' అని షరపోవా సమాధానం ఇచ్చింది. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.

  • Loading...

More Telugu News