: గంగా కావేరీ ఎక్స్ ప్రెస్ లో చోరీ, విజయవాడలో కేసు నమోదు
వారణాసి నుంచి విజయవాడ వస్తున్న గంగా కావేరి ఎక్స్ ప్రెస్ లో దొంగతనం జరిగింది. ఏసీ త్రీటైర్ బోగీలో 15 సూట్ కేసులు మాయమయ్యాయి. రూ.15 లక్షల విలువైన నగలతో పాటు భారీగా నగదు చోరీకి గురైంది. బాధిత ప్రయాణికులు విజయవాడ రైల్వే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధితుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రయాణికులు ఉన్నారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.