: మండలి ఛైర్మన్ ఎన్నిక నుంచి తప్పుకున్న కాంగ్రెస్
తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ ఎన్నిక నుంచి కాంగ్రెస్ తప్పుకుంది. ఈ మేరకు తమ అభ్యర్థి వేసిన నామినేషన్ ను కాంగ్రెస్ ఉపసంహరించుకుంది. అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్సీలు సభ నుంచి వాకౌట్ చేశారు. బ్యాలెట్ ఓటింగ్ పద్ధతిపై తమకు విశ్వాసం లేదని ఎమ్మెల్సీ డీఎస్ అన్నారు. శాసనమండలిలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆయన విమర్శించారు.