: టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్సీలను కాపాడేందుకే రహస్య ఓటింగ్: డీఎస్
తెలంగాణ శాసనమండలి సమావేశం ప్రారంభమైంది. ముందుగా ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ మాట్లాడుతూ, టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్సీలను కాపాడేందుకే ఛైర్మన్ ఎన్నికకు బ్యాలెట్ పద్ధతి పెడుతున్నారని ఆరోపించారు. గతంలో ఛైర్మన్ ఎన్నిక విషయంలో సంప్రదాయం పాటించామని... కానీ, ప్రభుత్వం ఇలా ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదన్నారు. తెలంగాణలో కరవు పరిస్థితి ఉండగా ఇంత హడావుడిగా ఛైర్మన్ ఎన్నిక అవసరమా? అని ప్రశ్నించారు. కేవలం ఛైర్మన్ ఎన్నిక కోసమే సమావేశం ఏర్పాటు చేయడం అప్రజాస్వామికమని వ్యతిరేకించారు. కాబట్టి, మండలి ఛైర్మన్ ఎన్నికను వాయిదా వేయాలని కోరారు. సభలో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని చెప్పామన్నారు.