: ఏపీ, తెలంగాణ మధ్య మధ్యవర్తిత్వం వహించాలని కేంద్ర హోం కార్యదర్శికి ఆదేశం


రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత పలు మౌలిక విషయాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా మంచినీరు, నీటిపారుదల, విద్యుత్ సరఫరా, పురపాలక వ్యవహారాలు మొదలైన విషయాల్లో రాష్ట్రాల నడుమ విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల పరిపాలన నిర్వహణకు మధ్యవర్తిత్వం వహించాలని కేంద్ర హోం కార్యదర్శి అనిల్ గోస్వామిని హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆదేశించారు. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రెటరీలతో త్వరలో సమావేశం ఏర్పాటుచేసి స్నేహపూర్వకంగా సమస్యలు పరిష్కరించుకోవాలని సర్దిచెప్పాలని తెలిపారట.

  • Loading...

More Telugu News