: చైనా సరిహద్దు సమీప ప్రజలకు మిలిటరీ శిక్షణ


ఆసియా పెద్దన్న చైనాతో స్నేహపూర్వకంగా మెలగాలన్న ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయాన్ని గౌరవిస్తూనే, భారత సైన్యం నూతన ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంటోంది. చైనా దూకుడును సమర్థంగా ఎదుర్కొనేందుకు సరిహద్దుల్లోని ప్రజలకు సైనిక శిక్షణ ఇవ్వాలని భావిస్తోంది. అత్యవసర సమయాల్లో ప్రజలను కూడా సైనిక అవసరాలకు వినియోగించుకోవచ్చని ఆర్మీ తలపోస్తోంది. ప్రపంచంలో అత్యధిక దేశాలు సరిహద్దు ప్రజలను సాయుధ పోరాటానికి ప్రోత్సహిస్తాయని, భారత్ లో మాత్రం 'సున్నితమైన అంశం' పేరిట ప్రజలను ఇలాంటి చర్యలకు దూరంగా ఉంచుతారని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News