: 24 గంటల విద్యుత్ సరఫరాకు ప్రణాళికలు సిద్ధం చేయండి: చంద్రబాబు


24 గంటలూ విద్యుత్ సరఫరాకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కేంద్ర విద్యుత్ శాఖ నుంచి తనిఖీ బృందం రాష్ట్రానికి వస్తుందని సీఎం అధికారులకు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో గృహ, వాణిజ్య అవసరాలకు విద్యుత్ సరఫరాపై ఆయన ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులతో పాటు మంత్రులు యనమల, గంటా శ్రీనివాసరావు, రావెల కిశోర్ బాబు పాల్గొన్నారు.

అటవీ శాఖ అధికారులతో కూడా చంద్రబాబు సమావేశమయ్యారు. ఎర్రచందనం అక్రమ రవాణా విషయంపై ఈ భేటీలో చర్చించినట్టు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో అటవీ సంపద దోపిడీకి గురైందని చంద్రబాబు చెప్పారు. అటవీ సంపద దోపిడీపై క్షేత్రస్థాయి పరిశీలన జరపాలని అధికారులను ఆదేశించారు. అటవీ సంపదను పునరుద్ధరించేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

  • Loading...

More Telugu News