: చెన్నైలో భవనం కూలిన ఘటనలో ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు
చెన్నైలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిన ఘటనలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్టీఆర్ఎఫ్) సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 65 గంటలుగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని ఎన్డీఆర్ఎఫ్ ఐజీ చెప్పారు. ఇప్పటి వరకు శిథిలాల్లో చిక్కుకున్న 11 మందిని సజీవంగా వెలికితీశామని ఆయన తెలిపారు. 22 మృతదేహాలను బయటకు తీశామన్నారు. ఎన్డీఆర్ఎఫ్ లోని యూఎస్ఏఆర్ కు చెందిన 10 బృందాలు గాలింపు చర్యల్లో నిమగ్నమయ్యాయని ఆయన వెల్లడించారు.