: కమనీయంగా సాగిన రేణుకా ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవం


హైదరాబాదులోని బల్కంపేట రేణుకా ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవం కమనీయంగా సాగింది. ప్రతి యేటా ఆషాడమాసంలో మూడు రోజుల పాటు అమ్మవారికి కల్యాణోత్సవ వేడుకలను నిర్వహించడం ఆనవాయతీ. వేడుకల తొలిరోజైన ఇవాళ అమ్మవారికి కల్యాణం జరిపించారు. ఈ కల్యాణ వేడుకను చూసేందుకు తెలంగాణ నలుమూలల నుంచే కాక, పలు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సికింద్రాబాదు ఎంపీ బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.

  • Loading...

More Telugu News