: ఈ చైనా కుక్క చైన్ స్మోకర్ గురూ!


పొగత్రాగడం హానికరమని ప్రభుత్వాలు ఊదరగొట్టేది మనుషుల కోసమేగానీ, తమ కోసం కాదంటోందీ చైనా శునకం. బీజింగ్ లోని ఈ కుక్క గారు యజమానిని చూసి దమ్ముకొట్టడం స్టార్ట్ చేసిందట. ఇంకేముంది, రోజుకు ప్యాకెట్లు ప్యాకెట్లు ఉఫ్ మని ఊదిపారేస్తూ చైన్ స్మోకర్ లా తయారైందట. అచ్చు మనుషుల్లానే నిద్ర పోయే ముందు కూడా ఓ సిగరెట్ వెలిగించందే పనిజరగదట.

అయితే, తన పెంపుడు శునకం ఏ బ్రాండ్ పడితే ఆ బ్రాండ్ తాగదని, కేవలం యూక్సీ బ్రాండే లైక్ చేస్తుందని యజమాని 'లూ' చెబుతున్నాడు. అయితే, ఇలా వరుసబెట్టి సిగరెట్లు తాగితే ఆరోగ్యం దెబ్బతింటుందున్న ఉద్దేశంతో దానితో స్మోకింగ్ మాన్పించేస్తానని సదరు యజమాని ముక్తాయించాడు.

  • Loading...

More Telugu News