: ఇక 'నొప్పి'ని కూడా కొలవచ్చు!


ఒకడికి దెబ్బ తగిలిందంటే ఎంత నొప్పి కలిగిందంటే.. వాడి మూలుగుల్ని బట్టి అర్థం చేసుకోవాల్సిందే తప్ప.. కొలవడానికి ప్రత్యేకమైన కొలబద్ధ ఏదీ లేదు. అయితే కొలరాడో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, నొప్పి మోతాదును కూడా బ్రెయిన్‌ స్కాన్‌ల ద్వారా కొలవవచ్చునని నిరూపించారు. శరీరానికి నొప్పి కలిగినప్పుడు.. మెదడులో ఏర్పడే నాడీసంబంధ సంకేతాన్ని వాళ్లు గుర్తించారు. నొప్పి ఎంత ఉన్నా చెప్పలేని వారు కొందరుంటారు. అలాంటి వారిలో నొప్పి తీవ్రతను ఈ పద్ధతిలో తెలుసుకోవచ్చు. బ్రెయిన్‌ స్కానింగ్‌ ద్వారా ఇది సాధ్యమని తేలింది. మందులు వాడాక నొప్పి తగ్గుతూ ఉండడాన్ని కూడా ఈ పద్దతిలో నమోదు చేయడం సాధ్యం అవుతుందిట.

  • Loading...

More Telugu News