: తెలంగాణ రాష్ట్రానికి ఎయిమ్స్ కావాలి: టీఆర్ఎస్ ఎంపీలు
తెలంగాణ రాష్ట్రానికి ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కావాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు వారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ తో సమావేశమయ్యారు. తెలంగాణకు ఎయిమ్స్ ను మంజూరు చేయాలని వారు కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.