: పార్టీ ఎంపీ వ్యాఖ్యలపై మమతా బెనర్జీ ఆవేదన చెందారు: తృణమూల్


పార్టీ ఎంపీ తపస్ పాల్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆవేదన, బాధ వ్యక్తం చేశారని తృణమూల్ కాంగ్రెస్ తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ నేత ముకుల్ రాయ్ మాట్లాడుతూ, "తపస్ పాల్ చేసిన కామెంట్లు మమతాను తీవ్రంగా బాధించాయి. ఈ విషయంపై పార్టీ రేపు నిర్ణయం తీసుకుంటుంది" అని చెప్పారు. మరో పార్టీ నేత డెరెక్ ఒ బ్రియాన్ చెబుతూ, 'ముఖ్యమంత్రి మమతా చాలా సున్నితమైన వ్యక్తి' అన్నారు. ఈ అంశంలో ఎంపీని అందరూ పిచ్చివాడని అనుకుంటారని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News