: 'తెహల్కా' ఎడిటర్ కు సాధారణ బెయిల్
'తెహల్కా' వెబ్ సైట్ వ్యవస్థాపకుడు తరుణ్ తేజ్ పాల్ కు షరతులతో కూడిన బెయిల్ ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. ఆయనపై కొనసాగుతున్న విచారణను ఎనిమిది నెలల్లోగా పూర్తి చేయాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. రెండు రోజుల కిందటే ఆయన మధ్యంతర బెయిల్ ను కోర్టు పొడిగించిన సంగతి తెలిసిందే. తోటి ఉద్యోగినిపై లైంగిక దాడి కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న తేజ్ పాల్ కొన్నాళ్ల వరకు గోవా జైల్లో రిమాండులో ఉన్నారు. ఇటీవల ఆయన తల్లి మరణించడంతో కర్మకాండలు నిర్వహించేందుకు మధ్యంతర బెయిల్ ను పొందారు.