: సీఎం చంద్రబాబుతో ఆర్ధికమంత్రి యనమల భేటీ
ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు సమావేశమయ్యారు. వివిధ శాఖలకు సంబంధించిన శ్వేత పత్రాల విడుదలపై ఇందులో చర్చిస్తున్నారు. మొత్తం ఆరు శాఖలకు సంబంధించిన శ్వేతపత్రాలను విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా విద్యుత్ శాఖకు సంబంధించిన శ్వేతపత్రం తయారు ఇప్పటికే పూర్తయినట్టు సమాచారం.