: రాజస్థాన్ రాష్ట్ర జంతువుగా ఒంటె


తమ రాష్ట్ర జంతువుగా ఒంటెను గుర్తిస్తూ రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 'సర్కార్ ఆప్కే ద్వార్' ప్రచారం చివరి రోజు సందర్భంగా ముఖ్యమంత్రి వసుంధరా రాజె ఆధ్వర్యంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఒంటె రక్షణకు చర్యలు చేపడుతూ చట్టం తయారు చేసేందుకు మంత్రివర్గం సమ్మతి తెలిపింది. దానివల్ల జంతువుల అక్రమ రవాణాపై తనిఖీల వేళ ఈ చట్టం సహాయపడుతుందని పేర్కొంది. కాగా, దానిపై నేడు ఓ ప్రకటన వెలువడుతుంది. అంతేగాక, తమ రాష్ట్ర రోడ్డు నెట్వర్కును మరింత బలోపేతం చేయాలని, యువత కోసం ఉద్యోగావకాశాలు సృష్టించాలని రాజస్థాన్ సర్కారు నిర్ణయించింది.

  • Loading...

More Telugu News