: చెన్నై ఘటనలో 28కి చేరిన మృతుల సంఖ్య


రెండు రోజుల కిందట చెన్నై శివారులోని మౌళివాక్కంలో పదకొండు అంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 28కి చేరింది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం ఈ రోజు అధికారికంగా విడుదల చేసిన బులెటిన్ లో తెలిపింది. 24 మంది క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు వివరించింది. కాగా, చనిపోయిన వారిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన నలుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నట్టు బులెటిన్ లో పేర్కొన్నారు. ఇదిలావుంటే, గాయపడిన వారిని ఈ రోజు మంత్రి అచ్చెంనాయుడు పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు, భవనం కూలిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News