: ప్రణబ్ ముఖర్జీ అరుదైన ఘనత
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అరుదైన ఘనత సొంతం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రజలతో మరింతగా మమేకమయ్యేందుకు రాష్ట్రపతి భవన్ నేడు ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయనుంది. ఈ క్రమంలో ప్రణబ్ ట్విట్టర్ ఖాతా కలిగిన తొలి రాష్ట్రపతిగా నిలుస్తారు. ఇప్పటికే ప్రణబ్ ముఖర్జీ ఫేస్ బుక్ పేజీకి 5 లక్షల లైక్స్ వచ్చాయి. తాజాగా ట్విట్టర్ ఖాతా కూడా అదే రీతిలో ఆదరణ చూరగొంటుందని రాష్ట్రపతి భవన్ వర్గాలు భావిస్తున్నాయి.