: రెండో రోజూ కొనసాగుతున్న జూడాల ఆందోళన
గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ల ఆందోళన రెండోరోజూ కొనసాగుతోంది. జూడాలపై దాడిని నిరసిస్తూ వారు విధులను బహిష్కరించారు. ఈ నేపథ్యంలో రోగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. తమకు వైద్యం అందించాలంటూ వారూ ఆందోళన బాట పట్టారు.