: ఎన్టీఆర్ జీవితంపై పదో తరగతిలో పాఠ్యాంశం
సినీ రంగంలో మేటిగా ఎదిగి, అటుపై తెలుగు వారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించిన దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలిచిన ఆయన జీవిత చరిత్రను ఈ ఏడాది పదోతరగతి సాంఘికశాస్త్రంలో పొందుపరిచారు. ఎన్టీఆర్ జీవితంలోని ముఖ్యమైన అంశాలను, ఘటనలను ఈ పాఠ్యాంశంలో ఉంచారు. సాంఘికశాస్త్రంలోని 268వ పేజీలో ఆ పాఠం ఉంటుంది. ముఖ్యమంత్రిగా చేసిన సమయంలో ఆ మహోన్నత వ్యక్తి పేదవారికి ఉపయోగపడేలా తీసుకొచ్చిన పథకాలు, చేసిన సేవలను పాఠ్యాంశంలో వెల్లడించారు.