: 'ఎన్ కన్వెన్షన్' నిర్మాణంలో నాగార్జునకు ఊరట... నేడూ విచారణ


హైదరాబాదులోని హైటెక్ సమీపంలో ఉన్న 'ఎన్ కన్వెన్షన్' హాల్ విషయంలో సినీ నటుడు నాగార్జునకు హైకోర్టులో ఊరట లభించింది. దానిపై యథాతథస్థితిని కొనసాగించాలని న్యాయస్ధానం అధికారులను ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం, ఖానామెట్ (హైటెక్ సిటీ) దగ్గరలోని తుమ్మిడికుంట చెరువులోని బఫర్ జోన్ ను ఆక్రమించి నాగార్జున ఈ ఫంక్షన్ హాల్ నిర్మించారని రెవెన్యూ అధికారులు తాజాగా రెడ్ మార్కింగ్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో హాల్ నిర్మాణాన్ని కూల్చివేసే అవకాశాలు ఉన్నాయంటూ నిన్న (సోమవారం) లంచ్ మోషన్ పిటిషన్ రూపంలో నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. ఫంక్షన్ హాల్ ను లీజుకు తీసుకున్న నల్లా ప్రీతమ్ అనే వ్యక్తి కూడా నాగ్ తో పాటు పిటిషన్ దాఖలు చేశారు. వాటిని పరిశీలించిన కోర్టు తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News