: వోల్వో బస్సు బోల్తా... టీఆర్ఎస్ ఎంపీటీసీలకు తీవ్రగాయాలు
హైదరాబాద్-బెంగళూరు రహదారిపై ఓ ప్రైవేటు ట్రావెల్స్ కు చెందిన వోల్వో బస్సు బోల్తాకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు టీఆర్ఎస్ ఎంపీటీసీలు గాయపడ్డారు. వారిలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వీరందరూ బెంగళూరు విహారయాత్రకు వెళుతుండగా అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కాశేపల్లి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కాగా, ప్రమాదంలో గాయపడినవారిని గుత్తి ఆసుపత్రికి తరలించారు.