: టీఆర్ఎస్ రాజకీయ ఎత్తుగడకు పాల్పడుతోంది: పొన్నాల
కాంగ్రెస్ ఎమ్మెల్సీలను టీఆర్ఎస్ లో చేర్చుకోవడం, ఆ కొన్ని రోజులకే తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ ఎన్నికను పెట్టడంపై ఆ ప్రాంత కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇతర పార్టీల నేతలను టీఆర్ఎస్ లో చేర్చుకోవడం అనైతికమని టీ పీసీసీ ఛైర్మన్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. అనర్హత పిటిషన్ అమల్లోకి రాకముందే ఛైర్మన్ ఎన్నిక సరికాదన్నారు. ఈ విషయంలో ఆ పార్టీ రాజకీయ ఎత్తుగడకు పాల్పడుతోందని ఆరోపించారు. మండలి ఛైర్మన్ ఎన్నిక వాయిదా వేయాలని కోరామన్నారు.