: తెలంగాణలో రైల్వే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయండి: ఎంపి కవిత
త్వరలో పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఎంపీ కవిత కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణలో మధ్యలో వదిలేసిన పలు ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని ఆమె కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానందగౌడను ఆమె కలిశారు. తెలంగాణలో 60 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరారు. నిజామాబాద్-పెద్దపల్లి లైనుకు, బోధన్-బీదర్ లైనుకు ఈ బడ్జెట్ లోనే నిధులు కేటాయించాలని రైల్వే మంత్రిని కోరినట్టు ఆమె మీడియాకు తెలిపారు.